ఉగాది

సృష్టికి ఆది – మన ఉగాది
నూతనోత్సాహానికి పునాది – మన ఉగాది
నవవసంతానికి దారి  – మన ఉగాది
నవజీవనానికి నాంది  – మన ఉగాది

కోయిలమ్మల మధురగానాలకు
పక్షుల కిలకిలరావాలకు
తుమ్మెదల ఝుంకారాలకు
చిగుళ్లతో చెట్ల సింగరాలకు
ప్రకృతి శోభాయమానానికి నెలవు – మన ఉగాది

గుమ్మాలకు తోరణాలు
వాకిలిలో రంగవల్లులు
గ్రామదేవతల సంబురాలు
బంధుమిత్రుల కోలాహలమునకు
షడ్రుచుల ఆస్వాదమునకు
భవిత నింపే పంచాంగ శ్రవణమునకు
మమతానురాగాలకు నెలవు – మన ఉగాది

మిలమిల మెరిసే ఉషోదయ కిరణాలతో
ఆహ్లాదకర ప్రకృతి ఒడిలో
తాజా శ్వాసతో
నూతన సంవత్సరానికి స్వాగతం
కృష్ణస్వరూప వసంత ఋతువుకు సుస్వాగతం

లేవండి.. లేవండి..
నవీన భావాలతో..
సరిక్రొత్త ఆశయములతో..
నిత్య నూతన చైతన్యముతో..
మీ భవితను భవ్యముగా
మలుచుకొనుటకు చక్కని అవకాశం..

వేయండి మీ హృదయంలో
దృఢమైన సాత్త్విక బీజాన్ని
ఈ *ఉగాది* పర్వదినాన..

హరిః ఓమ్
తత్సత్

✍️ రాంశ్రీ యోగీశ్వర్

అద్వైతం

ప్రపంచమంతా కుల-మత-జాతి-వర్ణ-ప్రాంత-తెగ-రంగు భేదములు లేకుండా ప్రేమగా ఒక్కటిగా ఉండాలంటే..

సనాతన ధర్మం యొక్క యథార్థ స్వరూపమైన  అద్వైత తత్త్వమును (అద్వైతమును ) ప్రచారం చేయాలి.

అహం బ్రహ్మాస్మి

తత్వమసి

అయమాత్మా బ్రహ్మ

ప్రజ్ఞానం బ్రహ్మ

అనే వేదప్రమాణ వాక్యములను గ్రహించగలగాలి.

ఈ బ్రహ్మజ్ఞానమును అనుభవపూర్వకంగా తెలుసుకున్నవారే నిజమైన బ్రాహ్మణులు.

ప్రాచీన భగవద్గీత

Watch “శ్రీమద్భగవద్గీత శ్లోకం 2” on YouTube

Watch “శ్రీమద్భగవద్గీత – అర్జున విషాదయోగము – శ్లోకం 1” on YouTube

Watch “శ్రీమద్భగవద్గీత పరిచయం సందర్భం మహత్యం” on YouTube

Watch “భగవద్గీత ధ్యానం” on YouTube

శుక్లాంబరధరం శ్లోకం

https://youtu.be/9R__r9DHup4

Do Spiritual Sadhana at home and stay blessed & safe.

https://m.facebook.com/story.php?story_fbid=3133427446681408&id=100000425511033&sfnsn=wiwspmo&extid=AEpKylau4WxAV9L4&d=n&vh=i

Love

  • Twitter Updates

  • Archieve

  • Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

    Join 2 other subscribers
  • Sri Vidyaprakashanandagiri Swami